Header Banner

ట్రెండ్ సెట్ చేసిన తాత, బామ్మ.. 70 ఏళ్ల లివింగ్ రిలేషన్ షిప్.. 95 ఏళ్లకు పెళ్లి! ఈ స్టోరీ వింటే మతి పోవాల్సిందే.!

  Mon Jun 09, 2025 11:20        India

ప్రేమకు, బంధానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, రాజస్థాన్‌కు చెందిన ఒక వృద్ధ జంట ఏడు దశాబ్దాల సహజీవనం అనంతరం సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. ఈ అరుదైన ఘటన డుంగర్‌పూర్ జిల్లాలోని గలందర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో ఈ వివాహ వేడుక కన్నుల పండువగా జరిగింది. 95 ఏళ్ల రామా భాయ్ అంగారి, 90 ఏళ్ల జీవలీ దేవి దంపతులు గత 70 ఏళ్లుగా కలిసే జీవిస్తున్నారు. వీరికి ఎనిమిది మంది సంతానం. వీరి పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవారై, వారిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమారుడు బాకు అంగారి (60) వ్యవసాయం చేస్తుండగా, రెండో కుమారుడు శివరామ్ (55), మూడో కుమారుడు కాంతిలాల్ (52) ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరో కుమారుడు లక్ష్మణ్ (52) కూడా వ్యవసాయదారుడే. కుమార్తెలు సునీత ఉపాధ్యాయురాలిగా, అనిత నర్సుగా సేవలందిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఎందుకు కెలుకుతారు.. ఆ ఇష్యూతో నాకేం సంబంధం? 'కన్నప్ప'పై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు..

 

వీరికి మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల తమ బంధానికి సంప్రదాయబద్ధంగా ఒక ముద్ర వేయాలని రామా భాయ్, జీవలీ దేవి ఆకాంక్షించారు. వారి కోరికను మన్నించిన పిల్లలు, ఈ పెళ్లిని ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హల్దీ, మెహందీ వంటి అన్ని సంప్రదాయ కార్యక్రమాలతో పాటు, డీజేలు, నృత్యాలతో కూడిన ఊరేగింపును కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ అపురూప వివాహ వేడుకను తిలకించేందుకు గ్రామస్థులు వేలాదిగా తరలివచ్చారు. పెళ్లి తంతులో భాగంగా వధూవరులు ఏడడుగులు నడిచారు. వచ్చిన అతిథులకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ, కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా కనిపించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నిజమైన ప్రేమకు గుర్తింపు అవసరం లేకపోయినా, దానిని వేడుకగా జరుపుకోవడంలో ఒక ప్రత్యేక ఆనందం ఉంటుందని ఈ జంట కథ నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rama Bhai Angari #Rajasthan wedding #old couple #marriage #Dungarpur district #70 year relationship #Indian wedding #viral wedding #elderly couple #traditional wedding #age is just a number